CPBrown charitra
CPBrown charitra
Key Features:
రచయిత : డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి
Author : Dr. Janamaddi Hanumachchastri
ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ - ‘సి.పి. బ్రౌన్’గా తెలుగు వారికి చిరస్మరణీయుడు. బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు చేసిన సేవకు తెలుగువారిగా మనమెంత చేసినా అతని ఋణం తీర్చుకోలేమని, కీ.శే. డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు పదే పదే పేర్కొనేవారు. తన జీవిత చరమాంకం వరకు బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధికై ఆరాటపడుతూ, భావితరాల వారికి బ్రౌన్ గ్రంథాలయం ‘‘వెలుగు స్తంభం’’గా నిలవాలని పరితపించేవారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అంగీకరించి, కారణాంతరాల వల్ల ముద్రించలేకపోయారు. కీ.శే. డా. జానమద్ది గారు చివరి రోజులలో ఈ పుస్తకం వెలుగుచూడాలని ఆకాంక్షించారు. శాస్త్రి గారు తెలుగులో వ్రాసిన చివరి పుస్తకం ఇదే.
